Site icon vidhaatha

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా మార్గదర్శకాలపై ప్రజలు అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖా అప్రమత్తమైంది. ఇప్పటికే ఓ మారు కేంద్ర హోంశాఖా కార్యదర్శి అజయ్ భల్లా వివిధ రాష్ట్రాల అధికారులతో చర్చించారు. ప్రజలందరూ విధిగా కరోనా మార్గదర్శకాలను పాటించేలా చూడాలని, కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని హెచ్చరించిన విషయం తెలిసిందే. పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలనూ హోంశాఖా అప్రమత్తం చేసింది. తాజాగా బుధవారం కేంద్ర హోంశాఖా కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు. జిల్లాల అధికారులకు, స్థానిక అధికారులకు కోవిడ్ మార్గదర్శకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాలని ఆ లేఖలో కోరారు. స్థానికంగా ఉండే అధికారులందరూ కోవిడ్ మార్గదర్శకాల విషయంలో అత్యంత కఠినంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. అలాగే రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచాలని, కరోనా మార్గదర్శకాలు పాటించేలా చూడాలని అజయ్ భల్లా సీఎస్‌లను కోరారు.

Exit mobile version