విధాత : జమ్మూ కశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.శ్రీనగర్‌లోని లాల్‌బజార్‌లో స్థానికేతరుడిని చంపేసిన ఉగ్రవాది ముక్తార్ షా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు’అని కశ్మీర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఒక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మరణిస్తే, మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరణించిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారే. వీరంతా ఇటీవల కాలంలో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతూ కశ్మీర్‌లోయలో బీభత్సం సృష్టించినట్టు ఆ అధికారి వివరించారు.
ఎన్ కౌంటర్ లతో దద్దరిల్లిన జమ్మూ.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి
<p>విధాత : జమ్మూ కశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. సొఫియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల శ్రీనగర్, బందిపొరా కాల్పులతో ప్రమేయమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ‘సొఫియాన్, తుల్రాన్, ఫీరిపొరా గ్రామాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని 24 గంటల్లో అందిన ప్రాథమిక సమాచారం మేరకు వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు