Site icon vidhaatha

సీబీఐపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

పంజరంలో చిలకలా ఉన్న సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలి
ఈసీ, కాగ్‌ మాదిరి సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలి: మద్రాస్‌ హైకోర్టు

విధాత,చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్‌, కాగ్‌ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది.

Exit mobile version