Site icon vidhaatha

ఎన్‌సీపీ నేత అల్లుడు అరెస్టు

విధాత,ముంబై: పుణెలో 2016లో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అవకతవకలపై ఎన్‌సీపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు గిరీష్ చౌదరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం అర్థరాత్రి వరకూ చౌదరిని ప్రశ్నించిన ఈడీ, ఆ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసింది. ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది.

ఖడ్సే 2020 అక్టోబర్‌లో బీజేపీని విడిచిపెట్టి ఎన్‌సీపీలో చేరారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఆయనకు ఈడీ సమన్లు పంపింది. ముంబైలో సుమారు 6 గంటల సేపు ప్రశ్నించింది. 2016లో దేవేంద్ర ఫడ్నవిస్‌ మంత్రివర్గంలో పనిచేసిన ఖడ్సే..రూ.30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని 3 కోట్లకు పర్చేజ్ చేసేందుకు వీలు కల్పిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2017లో ఖడ్గే, ఆయన భార్య మందాకిని, చౌదరి, స్థల యజమాని అబ్బాస్ అఖానీలపై మహారాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, 2018లో ఏసీబీ ఒక నివేదికలో ఖడ్సేకి క్లీన్ చిట్ ఇచ్చింది.

Exit mobile version