Site icon vidhaatha

పశ్చిమ బెంగాల్ లో ఏడవ దశ పోలింగ్ నేడే

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ దశలో పోలింగ్‌లో 86 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌ల ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version