Pan India Movie | త్రివిక్రమ్‌ అలా కట్టుబడి ఉన్నాడా? ఆయనని ఎవరూ మార్చలేరా?

విధాత‌, సినిమా: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో SSMB28 అనే చిత్రం చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘అతడు, ఖ‌లేజా’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ఆయన మహేష్‌తో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టాడు. అయితే మహేష్, త్రివిక్రమ్ తప్పితే మిగిలిన హీరోలు, దర్శకులు అందరూ నేడు పాన్ ఇండియా (Pan India) చిత్రాల ఒరవడిలో పడిపోయారు. యంగ్ హీరోలు, కొత్త […]

  • Publish Date - March 7, 2023 / 09:23 AM IST

విధాత‌, సినిమా: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో SSMB28 అనే చిత్రం చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘అతడు, ఖ‌లేజా’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ఆయన మహేష్‌తో హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టాడు. అయితే మహేష్, త్రివిక్రమ్ తప్పితే మిగిలిన హీరోలు, దర్శకులు అందరూ నేడు పాన్ ఇండియా (Pan India) చిత్రాల ఒరవడిలో పడిపోయారు. యంగ్ హీరోలు, కొత్త దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమాలంటూ ప్రకటనలు చేస్తున్నారు.

తమ సినిమాలో ఉన్న కంటెంట్ పాన్ ఇండియా స్థాయి కంటెంట్ అంటూ ప్రకటనలు చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా ప్రకటించే సమయంలోనే తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్టుగా గొప్పగా ప్రకటిస్తున్నారు. రాజ‌మౌళి (Rajamouli) మొద‌లుకొని ఇప్పుడందరూ పాన్ ఇండియా సినిమాల‌ వెంటపడుతున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆశే కనిపించడం లేదు. ఇక్కడ హిట్ట‌యితే అది ఆల్రెడీ పాన్ ఇండియా చిత్రమైపోతుందని వారికి బాగా తెలుసు.

తెలుగువారితోనే ఇంత‌కు ముందు మ‌నం ఎలాంటి చిత్రాల‌ను తీసి మెప్పించామో.. అదే త‌ర‌హాలో సినిమా చేసి హిట్ కొడితే.. దానినే పాన్ ఇండియా చిత్రం అంటారని.. మ‌నం ఎక్క‌డికో వెళ్లి పాన్ ఇండియా తీయ‌న‌క్క‌ర‌లేద‌ని, మ‌న ద‌గ్గ‌రే మ‌న‌వారితోనే బాహుబ‌లి వంటి చిత్రం తీస్తే అదే పాన్ ఇండియా చిత్రం అంటార‌నేది వారి భావ‌న‌. ఎందుకంటే గతంలో స్పైడర్ చిత్రం విషయంలో మహేష్ ఇలాంటి ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సినిమా బాగా లేకపోవడంతో తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఆడ‌లేదు. పాన్ ఇండియా చిత్రాలను మనం బాలీవుడ్ వెళ్లి తీయాల్సిన అవసరం లేదు.

మనం ఇక్కడ కేవలం తెలుగు కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఆ సినిమాలో దమ్ముంటే.. అది ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా (Pan India) రేంజ్ చిత్రమవుతుందనేది అందరూ చెప్పే మాట. దానికి వారు అర్జున్ రెడ్డి, జెర్సీ వంటి చిత్రాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు. అందుకే మహేష్, త్రివిక్ర‌మ్ ఎప్పుడు పాన్ ఇండియా చిత్రాల వెంట పడలేదు. భవిష్యత్తులో త్రివిక్రమ్ నుండి పాన్ ఇండియా సినిమాలు రావచ్చేమో కానీ.. ప్ర‌స్తుతానికైతే ఆయనకు ఆసక్తి లేదు అని ఇటీవల నిర్మాత నాగ వంశీ చెప్పాడు.

ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు పాన్ ఇండియా (Pan India) సినిమాలు చేస్తున్న ఈ సమయంలో.. త్రివిక్రమ్ మాత్రమే తెలుగు సినిమాలు చేయడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంలో కూడా త్రివిక్రమ్ పెద్దగా ఉలికిపాటుకు గురి కావడం లేదు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే విడుదలయ్యే చిత్రాలు చేయబోతున్నాడు.

ఆయ‌న‌లో ఎలాంటి అసంతృప్తి కూడా లేదు. మహేష్‌తో చేయబోయే సినిమా కూడా కేవలం తెలుగులో మాత్రమే విడుద‌ల కానుంద‌ని అంటున్నారు. విడుదల సమయంలో ఇతర భాషల్లో విడుదలకు ఏమైనా అవకాశం ఉందా? అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే మహేష్ పరంగా మాత్రం త్రివిక్రమ్ తర్వాత చేయబోయే చిత్రం పాన్ ఇండియానే గ్లోబల్ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు.

Latest News