Site icon vidhaatha

Giri Naagu | చ‌ప్పుడు కాకుండా.. మంచంపైకి వ‌చ్చి హ‌డ‌లెత్తించిన గిరినాగు

Giri Naagu | King Cobra

విధాత: కింగ్ కోబ్రా (King Cobra).. దాని ఆకారం చూస్తేనే..ఒళ్లు జలదరించి..గుండె జారిపోతుంది. 11అడుగుల మేరకు ఉన్న ఓ భయంకరమైన ఓ కింగ్ కోబ్రా ఏకంగా ఓ మనిషిపైనే పాకుతు ఉంటే అతని పరిస్థితి ఆ క్షణాన ప్రాణాలున్నా లేనట్లే లెక్కగానే అనుకోవాల్సిందే.. అంతటి గిరి నాగు ఓ ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న వ్యక్తిపై పాకుతూ.. ఇల్లంతా కలియ తిరిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఉత్తరాఖండ్‌లోని ఒక ఇంట్లోకి కింగ్ కోబ్రా (గిరి నాగు) నిశ్శబ్దంగా ప్రవేశించింది. ఆ భారీ విష సర్పం ఆ ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న వ్యక్తి మీదుగా పాకి.. ఇంట్లోని వస్తువులు..బట్టలపై పాకుతూ ఇల్లు అంతా కలియ తిరిగింది. ఆ వీడియోలో కింగ్ కోబ్రా పడగ విప్పి తనపై పాకుతున్న సమయంలోనూ నిద్రిస్తున్న వ్యక్తి కళ్లు తెరిచి చూస్తూ కదలకుండా ఉండిపోగా.. అది మెల్లగా అతని మీద నుంచి గదిలోని ఇతర ప్రాంతంలోకి పాకుతూ వెళ్లింది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..అది చూసిన నెటిజన్లు మాత్రం ఇదంతా రీల్ కోసం చేసిన వీడియో కావచ్చని కామెంట్లు పెడుతున్నారు. బహుశా అది పెంపుడు పాము కావచ్చు అని.. దాంతో రీల్ చేశారని భావిస్తున్నారు. మరి మీకేం అనిపిస్తుందో ఈ వీడియో చూసేయ్యండి మరి.

Exit mobile version