Crocodile Attacks Wild Buffalo : మొసలి పట్టుకు అడవి దున్న హంఫట్

ఆఫ్రికాలోని నైలు నదిలో నీటి కోసం వచ్చిన అడవి దున్నపై భారీ మొసలి దాడి చేసి లాగేసి చంపిన వీడియో వైరల్‌గా మారింది.

Crocodile Attacks Wild Buffalo

విధాత: నీటిలోని మొసలి బలాన్ని స్థాన బలానికి సంకేతంగా చెబుతుంటారు. అడవికి రాజు సింహం, భారీ ఏనుగులు సైతం నీటిలో మొసలి పట్టుకు చిక్కితే అంతే సంగతులంటారు. ఇందుకు పురాణాల్లో గజేంద్ర మోక్షం కథ కూడా నిదర్శనంగా వినిపిస్తుంటుంది.
తాజాగా అఫ్రికా ప్రాంతం నైలు నదిలో నీటి కోసం వచ్చిన ఓ అడవి దున్న నదిలోని భారీ మొసలి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన వీడియో వైరల్ గా మారింది. నదిలోకి వచ్చిన బలమైన అడవి దున్న మెడను పట్టుకుని నీటిలో నుంచి బయటకు తప్పించుకుపోకుండా మొసలి దాడి చేసింది.

మొసలి భారీ నుంచి తప్పించుకునేందుకు అడవి దున్న తనవంతు పోరాటాన్ని గట్టిగానే చేసింది. మొసలి పట్టును వదిలించుకుని నది గట్టుపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు అడవిదున్న చేసిన పోరాటం సరిపోలేదు. దీంతో నది నీటిలోని మొసలి బలం ముందు ఓడిపోయినన అడవి దున్న దానికి ఆహారంగా మారిపోయింది. అయితే నీటిలో మొసలి బలాన్ని ప్రతిఘటించడంలో హిప్పోలు(నీటి గుర్రాలు) చాల వరకు విజయవంతమవుతాయని వన్యప్రాణుల నిపుణులు గుర్తించారు. అడవిదున్నలు మాత్రం నీటిలో మొసలి దాడులను తిప్పికొట్టడంలో విఫలమవుతుంటాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Southern Africa floods| ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం..వందలాది మంది మృతి
Assam Bagurumba dance| వరల్డ్ వండర్ ..అస్సామ్ లో 10వేల మంది డాన్స్ ప్రదర్శన

Latest News