Lion Hunts Warthog | బొరియలో దాక్కున్నా..వదలని సింహం

ఆహారం కోసం అడవి పందిని వెంబడించిన ఆడ సింహం, అది దాక్కున్న చిన్న బొరియలోకి చొరబడి బయటకు లాక్కొచ్చి చంపి తినేసింది. సింహ బలం ముందు పంది ప్రయత్నం విఫలమైన ఈ వీడియో వైరల్‌గా మారింది.

Lions Hunts Warthog

విధాత: వన్యప్రాణులు ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడటం ప్రకృతి సహజ పరిణామంగా కొనసాగుతుంది. అయితే పెద్ద జంతువుల నుంచి తప్పించుకునే క్రమంలో చిన్న జంతువులు అనేక తిప్పలు పడుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహలతో పాటు మొసళ్లకు కూడా ఆహారంగా మారే అడవి పందులు తమ మనుగడ కోసం వాటి నుంచి తప్పించుకునేందుకు పడే తంటాలు ఒక్కోసారి విఫలమవుతుంటాయి. ఓ అడవిలో తారసిల్లిన అడవి పందిని వెంటాడుతూ ఓ ఆడ సింహం దానిపై లంఘించింది.

సింహం బారి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తిన అడవి పంది కనిపించిన ఓ బొరియలో దూరిపోయింది. ఇక నేను సేఫ్ అనుకుంది. అయితే ఆ బొరియలోతుగా లేకపోవడంతో పాటు ఆడ సింహం సైతం మధ్య సైజులోని సివంగి కావడంతో పంది ప్రయత్నాలు విఫలమయ్యాయి. పందిని వెంటాడుతూ వచ్చిన సింహం బొరియలోకి చొరబడి దానిని తన బలంతో పైకి లాక్కొచ్చి మరి చంపి తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సింహ బలం ముందు అడవి పంది ఎత్తులు పారలేదు పాపం అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Latest News