Site icon vidhaatha

UNNI MUKUNDAN: ప‌ల్లెలు తిరుగుతూ.. పిల్ల‌లతో క్రికెట్ ఆడుతూ ’మార్కో‘ ముకుందన్.. చిన్ననాటి సరదాలు

UNNI MUKUNDAN:

విధాత: మళయాళ హీరో ఉన్ని ముకుందన్ (UNNI MUKUNDAN) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యుకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరున్న నటుడు. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కుమారుడిగా, అనుష్క భఆగమతిలో అనుష్క లవర్ గా నటించి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆపై మాలిపురం అనే సినిమాతో సౌత్ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఈ ఏడాది జనవరిలో మార్కో అంటూ ఇండియన్ మోస్ట్ వయలెంట్ మూవీతో  ప్రేక్షకుల ముదుకు వచ్చి మొత్తం దేశాన్ని షాక్ కు గురి చేసి భారీ విజయాన్ని సైతం అందుకున్నాడు.

అయితే ఆయన ఇటీవల తన సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చి కేరళలో గ్రామాలన్నీ చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలో  ప్రయాణం మధ్యలో చిన్నపిల్లాడిలా మారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను బైక్ పై వెలుతున్న క్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఓ చోట పొలం గట్లలో స్థానిక పిల్లలు క్రికెట్ ఆడటం చూశాడు. అంతే తన బాల్య స్మృతులు మదిలో మేల్కొన్నాయోమోగాని.. తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసి వారిలో కలిసి పోయాడు

పిల్లలతో కలిసి పొలం గట్లతో క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. పొలం గట్లనే క్రికెట్ మైదానంగా.. వికెట్ల స్థానంలో మూడు కట్టెలు నాటి ఓ బ్యాట్ బాల్ తో క్రికెట్ ఆడుతున్న పిల్లలతో సరదాగా కలిసి క్రికెట్ ఆడటం తనకు చిన్ననాటి మధుర జ్జాపకాలను గుర్తుకు తెచ్చిందని ఉన్న ముకుందన్ సంబర పడ్డాడు. ఇలాంటి మధుర జ్జపకాలు చాల మందికి ఉంటాయని.. అప్పుడప్పుడు వాటిలోకి వెళ్లిరావడం సంతోషంగా అనిపిస్తుంటుందని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు..ఉన్ని ముకుందన్ ఆటను..మాటలను ఆస్వాదిస్తూ..మేం సైతం గో బ్యాక్ టూ మై బోయ్ హుడ్ డేస్ అంటు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version