Site icon vidhaatha

ప్రేమజంటకు వినూత్న శిక్ష..కాడికి కట్టి పొలం దున్నించారు

odisha-viral

విధాత : కులాలు..మతాంతర ప్రేమపెళ్లిళ్లపై సమాజంలో వివక్షత..వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ప్రేమజంటకు పెద్దలు వేసిన వినూత్న శిక్ష వైరల్ గా మారింది. ఒడిశాలోని(Odisha) రాయగడ జిల్లా(Rayagada district) కంజమజ్హిరా గ్రామంలో(Kanjamajhira village) వివాహం చేసుకున్న ప్రేమ జంటపై గ్రామపెద్దలు ఆగ్రహంతో రగిలిపోయారు. వరుసకు ఇద్దరూ బంధువులే అయినప్పటికీ గ్రామ ఆచారం ప్రకారం పెళ్లి జరగలేదని గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి వారికి విధించేందుకు ఏర్పాటు చేసుకున్న శిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రేమజంటను నాగలి కాడికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. నాగలి లాగలేక ప్రేమజంట అవస్థలు పడి రోధిస్తున్నా వారిని వదల్లేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రేమపెళ్లి చేసుకున్నందుకూ ఆ వధూ వరులను గ్రామపెద్దలు తమ మూఢాచారాలతో శిక్షించిన వైనం అనాగరికంగా..అమానుషంగా ఉందన్న విమర్శలు వ్యక్తమతున్నాయి.

Exit mobile version