Ricin Poison: The Invisible Killer Hidden in Castor Seeds — A Vidhaatha Special Report
- అముదపు గింజల్లో దాగిన మరణాయుధం – రైసిన్
- ఉగ్ర స్థావరాల్లో దొరికిన రిసిన్ – ఉలిక్కిపడ్డ నిఘాసంస్థలు
- కొద్దిమొత్తంతో వేలాదిమందిని చంపగల అత్యంత ఘోర విషపదార్థం
- ఒకే చెట్టులో అమృతం, కాలకూటం.. అసాధారణ ప్రకృతి విచిత్రం
(విధాత ప్రత్యేకం)
Ricin is Weapon | గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల వెలికితీసిన కాలకూట కుట్రతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహచరులతో కలిసి రైసిన్ అనే అత్యంత విషపూరిత జీవరసాయన పదార్థాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. గాంధీనగర్ సమీపంలోని అడలాజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో నాలుగు లీటర్ల ఆముదపు నూనె, నాలుగు కిలోల ఆముదపు గింజల గుజ్జు, రెండు గ్లాక్ పిస్తోళ్లు, ఒక బెరెట్టా పిస్తోలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ వైద్యుడి ఇంట్లో ఏటీఎస్ సోదాలు
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) మంగళవారం రాత్రి హైదరాబాద్(Hyderabad)లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో విస్తృత శోధనలు చేపట్టింది. రసాయన ఆయుధాల తయారీకి సంబంధించి నడుస్తున్న ఉగ్ర కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దిన్ సయ్యద్ నివాసమైన ఫోర్ట్ వ్యూ కాలనీ, ఉప్పరపల్లి ప్రాంతంలో ఉన్న ఇల్లు ఈ దాడుల కేంద్రంగా నిలిచింది. గుజరాత్ ATS బృందం, స్థానిక రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో ఇంట్లో గదులను శోధించి, అనుమానాస్పద యంత్రాలను, పరికరాలను స్వాధీనం చేసుకుంది. కుటుంబ సభ్యులను విచారించి, నిందితుడి ఇటీవల కదలికలపై వివరాలు సేకరించింది. ఆయన నవంబర్ 6న ‘బిజినెస్ పనుల కోసం వెళ్తున్నాను’ అంటూ ఇంటినుంచి బయలుదేరి, తిరిగి రాలేదని కుటుంబం తెలిపింది. అధికారులు శోధనల అనంతరం పంచనామా నమోదు చేశారు.
ఈ వివరాలు బయటకు రావడంతో ఒక్కసారిగా భద్రతా సంస్థలు, ప్రజారోగ్య వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. రైసిన్ అనేది పదార్థం పేలుడు పదార్థం కాదు — కానీ చిన్న పరిమాణంలోనూ ప్రాణాంతకం అవుతుంది.
జీవరసాయన దాడులకు కొత్త మార్గం – రైసిన్‌పై ఉగ్రవాదుల దృష్టి
రైసిన్ (Ricin) – పేరు చాలా మందికి తెలియదు కానీ ఇది మనిషిని కొద్ది గంటల్లోనే మరణానికి దారితీసే ఘోరమైన విషం. ఇది ఆముదపు గింజల నుండి తీసే ఆముదం నూనె తయారీ సమయంలో మిగిలే గుజ్జు నుండి తయారుచేస్తారు.
సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తిగా ఉన్నా, ఈ గింజలలోని కొన్ని జీవకణాలు ప్రోటీన్ సంశ్లేషణను అడ్డుకునే శక్తి కలిగిన విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణంగానే రైసిన్‌ను ప్రపంచవ్యాప్తంగా జీవరసాయన ఆయుధం (Biochemical Weapon)గా పరిగణిస్తున్నారు.
మొన్నటి దాడుల్లో ఈ పదార్థం ఉగ్రవాదుల స్థావరాల్లో లభించడంతో, దేశీయ భద్రతా సంస్థలు దీనిపై విస్తృత నిఘా ఏర్పాటు చేశాయి. పేలుడు దాడుల స్థానంలో రసాయన ఆయుధాల ఇప్పుడు ఉగ్రవాదుల కొత్త వ్యూహంగా మారనుందా అనేది భద్రతాసంస్థలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది.
రైసిన్ ప్రభావం – ఒక చుక్కతోనే ప్రాణాంతకం
రైసిన్ ఒక ప్రోటీన్ నిరోధక విషం. ఇది మన శరీరంలోని కణాల్లో ప్రోటీన్ తయారీని అడ్డుకుంటుంది. ఫలితంగా కణాలు చనిపోతాయి, శరీరంలోని ముఖ్య అవయవాలు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయి.
రైసిన్ శరీరంలోకి చేరే మార్గాలు:
- తినడం, తాగడం ద్వారా (food contamination)
- పీల్చడం ద్వారా (airborne exposure)
- ఇంజెక్షన్ రూపంలో (direct administration)
లక్షణాలు:
రైసిన్ ప్రభావం కొద్దిగంటల్లోనే కనిపిస్తుంది – లక్షణాలు:
- వాంతులు, విరేచనాలు
- శ్వాసలో ఇబ్బంది, ఊపిరితిత్తుల వాపు
- రక్తపోటు పడిపోవడం
- మూత్రపిండాల వైఫల్యం
1.25 మిల్లీ గ్రాముల రైసిన్ ఒక ఆరోగ్యవంతుడైన మనిషిని చంపగలదు. సైనైడ్(Cyanide) కంటే 6,000 రెట్లు, బొటులినం(Botulinum) కంటే 100 రెట్లు మారణశక్తి కలిగిఉంటుంది.
ఇప్పటికి వరకు దీనికి విరుగుడు లేదా చికిత్స లేదు. కొన్ని గంటల నుండి 2 లేదా 3 రోజుల్లోనే మనిషిని చంపగలదు. కేవలం మరణాన్ని వాయిదా మాత్రమే వేయగల చికిత్సలున్నాయి.
అందుకే అమెరికా CDC దీన్ని “Grade B Biological Toxin”, మరియు Chemical Weapons Conventionలో Schedule-1 Warfare Agentగా గుర్తించింది. ది ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్(OPCW) రిసిన్‌ను కెమికల్ వెపన్స్ కన్వెన్షన్( Chemical Weapons Convention) కింద అత్యంత ప్రమాకరమైన విషపదార్థంగా షెడ్యూల్1లో చేర్చింది.
ఆముదం — ఔషధమా? అయుధమా?
ఆముదం (Castor) చెట్టు సాధారణంగా ఔషధ గుణాల కోసం, అలాగే పారిశ్రామిక రంగాల్లోనూ విస్తృతంగా వాడబడుతుంది.
ఆముదం నూనె పేగు సమస్యలు, చర్మ సమస్యల నివారణకు వైద్యంగా ఉపయోగపడుతుంది. అయితే అదే గింజలలోని వృథా పదార్థంలో రైసిన్ అనే విషం ఉంటుంది.
ఔషధ వినియోగం: ఆముదం నూనె శతాబ్దానికి పైగా ప్రజల విస్తృత వినియోగంలో ఉన్న సహజ ఔషధం. ఆయుర్వేదంలో దీన్ని విరివిగా వాడతారు.
విషతుల్యత: ఆముదం గింజలలోని విషాన్ని నిర్మూలించకుండా ఉపయోగిస్తే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఒకే మొక్క – ఒకే సమయానికి జీవాన్ని కాపాడే ఔషధంగానూ, మరోవైపు కనబడకుండా ప్రాణాన్ని తీసే ఆయుధంగానూ మారగలదు. ప్రపంచ చరిత్రలో రైసిన్ చాయలురైసిన్ దశాబ్దాలుగా నిఘా మరియు భద్రతా చరిత్రలో ప్రస్తావించబడింది.
1978లో లండన్‌లో బల్గేరియన్ జర్నలిస్టు జార్జీ మార్కోవ్‌ను ఒక గొడుగు రాడ్‌లో దాచిన సూక్ష్మ రైసిన్ కణం ద్వారా హత్య చేశారు — ఇది “Umbrella Assassination”గా ప్రసిద్ధి చెందింది.
అమెరికాలో కూడా ఒక దశాబ్దం క్రితం అప్పటి అధ్యక్షుడు ఓబామాకు రైసిన్ లేఖలు పంపిన ఘటనలు గుర్తించబడ్డాయి.
ఇది ఒక అదృశ్య ఆయుధం. భద్రత, నిఘా వ్యవస్థల కనుగప్పి తేలిగ్గా తప్పించుకోగలదు. రంగు, రుచి, వాసన ఉండవు. అదే అత్యంత భయం గొలిపే పరిస్థితి. ప్రపంచమంతటికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న భయంకరంమైన ఆయుధమిది.
ఆముదం చెట్టు (Castor Tree) – ప్రకృతి ప్రసాదించిన ఔషధం
Castor Tree Benefits: From Medicine to Biofuel — Nature’s Most Versatile Plant
1️⃣ వైద్య ప్రయోజనాలు (Medicinal Benefits)
ఆముదం నూనె (Castor Oil): ఇది పేగు సమస్యలు, మలబద్ధకం, చర్మవ్యాధులు, మరియు జుట్టు పెరుగుదలలో ప్రాచీనంగా ఉపయోగిస్తున్నారు.
విరేచన మందు (Natural Laxative): స్వల్ప మోతాదులో ఆముదం నూనె జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకం నివారిస్తుంది.
సంధివాతం (Joint Pain): నూనెను వేడి చేసి మర్దన చేయడం వలన నొప్పి, వాపు తగ్గుతుంది.
చర్మ సమస్యలు: ఇందులోని ricinoleic acid చర్మంపై ఉన్న ఇన్ఫెక్షన్, పొక్కులు తగ్గించడంలో సహాయకరం.
2️⃣ సౌందర్య ప్రయోజనాలు (Cosmetic Uses)
జుట్టు పెరుగుదల: ఆముదం నూనె జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది, పొడిజుట్టుకు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది.
చర్మం మెరుపు: రాత్రి వేళ చిన్న మోతాదులో రాసుకోవడం వల్ల మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది.
ముడతలు తగ్గించడం: ఆముదం నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని మృదువుగా ఉంచి, వృద్ధాప్య ఛాయల నుండి దూరం చేస్తుంది.
3️⃣ వ్యవసాయ ప్రయోజనాలు (Agricultural Benefits)
పొలాల రక్షణ: ఆముదం చెట్టు వేగంగా పెరుగుతుంది, కాబట్టి గాలిని ఆపే wind barrierగా ఉపయోగిస్తారు.
ఎరువులలో వాడకం: ఆముదం గింజల గుజ్జు (castor bean mash) ప్రాసెసింగ్ తర్వాత సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఆర్గానిక్ ఎరువుగా పనిచేస్తుంది.
పురుగుమందు లక్షణం: ఆముదం మొక్కల వాసన పంటల చుట్టూ చీడపీడలను దూరంగా ఉంచుతుంది.
4️⃣ పారిశ్రామిక ప్రయోజనాలు (Industrial Uses)
బయోడీజిల్ ఉత్పత్తి: ఆముదం నూనెలో అధికంగా ఉన్న ricinoleic acid కారణంగా ఇది బయోడీజిల్ తయారీలో ప్రధాన ముడిపదార్థంగా ఉపయోగిస్తారు.
లూబ్రికెంట్స్, పేయింట్స్, సబ్బులు వంటి ఉత్పత్తుల తయారీలోనూ విస్తృతంగా వాడబడుతుంది.
ఎయిరోస్పేస్ రంగం: తాప నిరోధకత (heat resistance) ఉన్నందున ఇది రాకెట్ లూబ్రికెంట్‌లలో కూడా వాడబడుతుంది.
5️⃣ పర్యావరణ ప్రయోజనాలు (Environmental Benefits)
ఆముదం మొక్క తక్కువ నీటితో పెరుగుతుంది, పొడి వాతావరణాలకు తగినది. ఇది కార్బన్ డయాక్సైడ్ ఆప్షన్‌లో ప్రభావవంతం, వాతావరణ ఉష్ణతను తగ్గించడంలో సహకారం అందిస్తుంది. తక్కువ సమయంలో మంచి దిగుబడులు ఇచ్చే పంటగా ఇది రైతులకు ఆర్థికంగా లాభదాయకం. ఆముదం చెట్టు మొత్తం ఉపయోగకరమైనా, దాని గింజలు నేరుగా తినరాదు. ఎందుకంటే గింజలలోని ముడి పదార్థంలో రిసిన్ (Ricin) అనే విషపూరిత టాక్సిన్ ఉంటుంది. ఇది సరైన రసాయన ప్రాసెసింగ్ ద్వారా పూర్తిగా తొలగించబడిన తర్వాతనే ఆముదం నూనె సురక్షితంగా ఉపయోగించవచ్చు.
ఆముదపు గింజల్లోనుండి అత్యంత ప్రమాదకరమైన రైసిన్‌ను తయారుచేయవచ్చని ఐసిస్, హమాస్, అల్‌ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలకు ఎప్పటినుండో తెలుసు. దాన్ని వాడి, వాళ్లు కొన్ని హత్యలు కూడా చేసారు. అయితే భారత్‌లో దీని ఆనవాళ్లు లభించడం దేనికి సంకేతమనేదే ఇప్పుడు ప్రశ్న. ఐసిస్ సానుభూతిపరులు భారత్‌లో ప్రవేశించారా అనేది భద్రతాసంస్థల సందేహం. ప్రస్తుతం వారు దీన్ని నివృత్తి చేసుకునే పనిలోనే ఉన్నారు. ఏదేమైనా ఈ రకమైన సీమాంతర ఉగ్రవాదానికి శాశ్వత ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఏం చేయాలో భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి బాగా తెలుసు.
