మహారాష్ట్ర( Maharashtra )లోని షోలాపూర్( Solapur ) జిల్లాలోని కుర్దువాడికి చెందిన జలిందర్ జడ్కర్( Jalindar Jadkar ) 2020 వరకు టాటా మోటార్స్( TATA Motors )లో పని చేశారు. అయితే తన కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబం. దీంతో తాను కూడా వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో.. 2020లో టాటా మోటార్స్ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందారు. ఒక రోజు తన స్నేహితుడి వ్యవసాయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ అవకాడో సాగు( Avocado Farming )ను చూసి.. దాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే.. అవకాడో పండ్లకు ఇండియా( India )లో డిమాండ్ అధికంగా ఉందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించొచ్చనని తన ఫ్రెండ్ ద్వారా జలిందర్ తెలుసుకున్నారు. గోధుమ, చెరుకు పంట, మస్క్ మెలన్( Musk Melon ) వంటి పంటలను పండిస్తున్న తన పొలంలో కొత్తగా అవకాడో సాగు( Avocado Cultivation ) చేయాలని నిర్ణయించుకున్నాడు జలిందర్.
తొలి ప్రయత్నంలో భాగంగా ఎకరా పొలంలో పండిస్తున్న మస్క్ మెలన్ సాగుకు స్వస్తి పలికాడు. ఆ ఎకరా పొలంలో ఇండియా, మెక్సికోకు చెందిన అవకాడో వెరైటీలను సాగు చేశాడు. ఎందుకంటే మస్క్ మెలన్ కేజీ రూ. 35 మాత్రమే. అదే అవకాడో అయితే కేజీ రూ. 200. దీంతో లాభం ఎక్కువ వస్తుందని చెప్పాడు జలిందర్. ఇక మస్క్ మెలన్ సాగుకు లేబర్ కూడా ఎక్కువ అవసరం. అవకాడో సాగుకు లేబర్ పెద్దగా అవసరం లేదు. ఇక ఒక్కసారి అవకాడో మొక్కలు నాటితే.. 20 ఏండ్ల వరకు దాన్ని బాగోగులు చూసుకుంటే సరిపోతుంది.
అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ, విటమిన్లు, పోషకాలు విరివిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో 2023లో ఇండియా 39 లక్షల కేజీల అవకాడో పండ్లను దిగుమతి చేసుకుంది. వీటిని టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు వరల్డ్ బ్యాంక్ ట్రేడ్ డేటా ద్వారా తెలిసింది.
అవకాడో సాగుకు నేల సారవంతంగా ఉండాలి. పీహెచ్ 6.0 నుంచి 7.0గా ఉండాలి. కనీసం భూమి 60 సెం.మీ. లోతు వరకు తెగేలా ఉండాలి. అప్పుడు మొక్క నాటితే.. అభివృద్ధి కూడా బాగుంటుంది. దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ఇక జలిందర్ అవకాడో సాగును ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేశారు. ఆవు పేడ, వర్మి కంపోస్టును ఎరువుగా వాడాడు. ఎకరా పొలంలో ఇండియా రకానికి చెందిన అర్క సుప్రీమో రకమైన 100 అవకాడో మొక్కలను నాటాడు. మెక్సికన్ హాస్ వైరెటీకి చెందిన మరో 100 మొక్కలను నాటాడు. ఇక ఈ పంట సాగుకు నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు.
ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో అవకాడో మొక్కలకు పుష్పాలు పూస్తాయి. జూన్, జులై మాసం నాటికి అవకాడో కాయలు పక్వ దశకు చేరుకుంటాయి. ఆ సమయంలో అవకాడో కాయలను తెంచి విక్రయానికి సిద్ధం చేస్తారు. అర్క సుప్రీమో ప్లాంట్.. ప్రతి సీజన్‌లో 110 కేజీల వరకు కాయలను ఇస్తుంది. హాస్ వెరైటీ 80 కేజీల కాయలను ఇస్తుంది. అర్క సుప్రీమో రకానికి చెందిన అవకాడోను కేజీ రూ. 100 చొప్పున, హాస్ అవకాడోను రూ. 200 కేజీ చొప్పున విక్రయిస్తానని జలిందర్ చెప్పుకొచ్చాడు. ఇలా ఏడాదికి రూ. 26 లక్షలు సంపాదిస్తున్నాను. ఇండియా రకానికి రూ. 11 లక్షలు, మెక్సికన్ రకానికి రూ. 16 లక్షల ఆదాయం వస్తుంది. ఇది ఏడాది సంపాదన మాత్రమే. పెట్టుబడి ఖర్చులు రూ. 2 లక్షలు పోనూ తనకు రూ. 24 లక్షల ఆదాయం సమకూరుతుందని జలిందర్ తెలిపారు.