Site icon vidhaatha

Ananya Panday: రూమర్లు తట్టుకోలేకపోయా.. ‘లైగర్’ బ్యూటీ

Ananya Panday

విధాత‌: డైరెక్ట‌ర్ పూరీ జగన్నాధ్ త‌న సినిమాల‌తో ఇప్ప‌టివ‌ర‌కు చాలామంది ముద్దుగుమ్మ‌ల‌ను సినిమాల్లోకి ప‌రియం చేశారు. ఆ కోవ‌లోనే ‘లైగర్’ (Liger) మూవీతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday)ను తెలుగు వారికి పరిచయం చేశాడు. సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచినా అనన్య అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అయితే ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తాను కెరీర్ ఆరంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా అని, ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు వైద్యుల సూచనలతో థెరపీ తీసుకున్నానని, ప్రస్తుతం మాత్రం తాను రెగ్యులర్‌గా తీసుకుంటున్నాననే వార్తలను ఖండించారు.

కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదుడుకులను అందరిలా తట్టుకోలేకపోయానని, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను సీరియస్‌గా తీసుకోవడం వల్లే ఇదంతా వచ్చిందని చెప్పింది.

ప్రస్తుతం తాను అటువంటి వార్తలు వస్తున్నా వాటిని తేలిగ్గా తీసుకోవడానికి అలవాటు పడుతున్నానని, ఆ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్లు వెల్లడించింది.

Exit mobile version