Site icon vidhaatha

మళ్లీ పెళ్లికి సిద్ధ‌మైన నిహారిక‌?

విధాత‌: మెగాస్టార్ ఇంట మ‌రోమారు పెళ్లిబాజాలు మోగే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నాగ‌బాబు కూతురు నిహారిక త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది. మెగా డాటర్స్ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తలకు విడాకులు ఇవ్వడంతో వీరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తునే ఉన్నారు.

చిరంజీవి కుమార్తె శ్రీజ‌కు రెండు సార్లు వివాహం జ‌రిగి విడాకులిచ్చి ఇప్పుడు ఒంట‌రిగా ఉంటుండ‌గా, ఆ త‌ర్వాత నిహారిక వివాహం జ‌రిగిన‌ రెండేండ్ల‌కే డైవ‌ర్స్ జ‌రగ‌డం తిరిగి సినిమాలు, సిరీస్‌ల నిర్మాణంలో బిజీ కావ‌డం చ‌క‌చ‌కా అయిపోయాయి.

అయితే విడాకులు తీసుకున్న ఏడాది త‌ర్వాత ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉందనే వార్త నెట్టింట బాగా హల్చల్ చేస్తోంది. ఈమె ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని సమాచారం. మరి నిహారిక ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version