Site icon vidhaatha

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం

విధాత‌: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా 50 శాతం పదవులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉందన్నారు. పవర్ జనరేషన్ కోసం నీటిని కిందకి వదిలారని, ఇదంతా కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయించకపోవడం వల్లే జరిగిందని సజ్జల అభిప్రాయపడ్డారు. అందుకే అందుకే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని ఆయన తెలిపారు. ఏడేళ్ల తర్వాత ఇది ఒక పెద్ద ముందడుగుగా చెప్పొచ్చన్నారు. రాయలసీమ లిఫ్ట్‌పై టీడీపీ అపోహలు సృష్టించేందుకు చూస్తోందని ఆయన ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లా వారికి అన్యాయం జరగదన్నారు. వారికోసం వెలిగొండను పూర్తి చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూడా 50 శాతం ఇస్తున్నామని, రేపు ప్రకటన వెలువడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Exit mobile version