Site icon vidhaatha

Anakapalli | పరవాడ ఫార్మసీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

Anakapalli | అనకాపల్లి పరవాడ ఫార్మసిలో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్ వాసులని గుర్తించారు. సంఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆ జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అచ్యుతాపురం ఏసెన్షియ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఏపీలోని పారిశ్రామిక సంస్థలలో గత ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగి 120 మంది ప్రాణాలు కోల్పోయిన తీరు కంపెనీల నిర్వహణలోపాలకు అద్దం పడుతుంది. కాగా ఏపీ మాజీ సీఎం జగన్ నేడు అనకాపల్లి చేరుకొని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు.

Exit mobile version