Site icon vidhaatha

ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం

విధాత‌: ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చించింది. వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Exit mobile version