పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు: ఏపీ సీఈవో మీనా

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

  • Publish Date - May 23, 2024 / 03:58 PM IST

విధాత : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని, ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని, దర్యాప్తుతో ఆ వీడియో లీక్ అంశం తేలుతుందని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న పాల్వాయిగేటు పీవో, ఏపీవోలనుల సస్పెండ్ చేశామని తెలిపారు.

మాచర్లలో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు పరామర్శ పరుతో మాచర్లకు వెళ్లడం సరికాదన్నారు. టీడీపీ నేతలు అక్కడికివెళితే మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముందని, మాచర్లకు బయటివాళ్లు ఎవరు వెళ్లవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్నందునా స్ట్రాంగ్ రూమ్ భద్రత..కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టామన్నారు.

Latest News