నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలు
Employees Transfers | ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. మరోవైపు ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు.
ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు బదిలీలకు అనుమతినిచ్చారు. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ (Service) పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పని సరి బదిలీకి నిర్ణయించారు. ట్రైబల్ ఏరియాల్లో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వాళ్ళకు బదిలీల్లో అవకాశమిస్తారు. స్పౌజ్ కేసుల్లో, వ్యక్తిగత అభ్యర్థనలు, ఫిజికల్ చాలెంజ్ ఉద్యోగులు, వితంతు, ఆరోగ్య సమలు ఎదుర్కొనే వారికి బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ఆఫీసర్ల బదిలీలకు మినహాయింపులిచ్చింది.