Site icon vidhaatha

ఏపీ అధికారులను సరిహద్దు వద్ద నిలిపి వేయడం దురదృష్టకరం

విధాత‌:తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారుల బృందాన్ని సరిహద్దు వద్ద నిలిపి వేయడం దురదృష్టకరం అని గురజాల ఆర్డీవో జె. పార్థసారధి అన్నారు.నాగార్జునసాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి ఆపమని ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇద్దామని వెళ్తే తెలంగాణ పోలీసులు అనుమతించలేదు.ఆశించిన స్థాయిలో వర్షాలు లేక నాగార్జున సాగర్ డ్యాం లో నీళ్లు తక్కువగా ఉన్నాయి,వ్యవసాయ సీజన్ కు సాగునీరు అందించకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి.
సాగర్ డ్యామ్ వద్ద విద్యుత్తు చేయటం వలన నీరు సముద్రంలో కలసిపోయి ఉపయోగం లేకుండా పోతుంది.సాగర్ డ్యాం వద్ద నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నాం.

ReadMore:జల వివాదంపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు

Exit mobile version