Site icon vidhaatha

‘ఏపీలో  నల్ల గడ్డం పాలన ముగిసి తెల్లగడ్డం  అధికారంలోకి వచ్చిందంతే…’

రాష్ట్రంలో నల్ల గడ్డం పాలన(black beard rule ) ముగిసి తెల్లగడ్డం(white beard)  అధికారంలోకి వచ్చింద‌ని(come to power), ప్రభుత్వం, గడ్డాలు మారినాయే తప్ప పాలకుల పద్దతుల్లో ఎటువంటి మార్పులేదని(no change)  సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(CPI National secretary  K. Narayana ) అన్నారు. శుక్రవారం ఏపీలోని గూడూరులోని హోటల్ మహేంద్ర ఎలైట్ లో  నిర్వ‌హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా గడచిన అధ్యాయంలా సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరించడం(CM Chandrababu Naidu’s treatment of special status as a bygone chapter is not appropriate) సరికాదన్నారు. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్రాభివృద్ధి సాధ్యపడదన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో చర్చించాలన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు(privatize Visakha Steel) ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విశాఖ ఉక్కు కర్మాగారం వద్దకొచ్చి(The CM came to the Visakhapatnam steel plant) బహిరంగంగానే ప్రైవేటీకరించ వ‌ద్ద‌ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 రాష్ట్రంలో మద్యం పాలసీ(liquor policy) కొత్త సీసాలో పాత సారా చందాన ఉందని నారాయ‌ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం పేరుతో ఒక్కరే దోచుకోగా ఈ ప్రభుత్వం మద్యం పాలసీని వికేంద్రీకరించి(decentralized) ఎక్కువమంది దోచుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు.  ఎన్నికల ముందు ఇసుక ఉచితంగా(free sand) అందిస్తామని  ఇచ్చిన హామీని వంద రోజులు దాటినా ఎందుకు అమలుచేయలేకున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు( middle class people) ఇసుక అందని ద్రాక్షగా మారిందన్నారు. అదే సమయంలో టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) నాయకులకు()LEADERS, రెవెన్యూ అధికారుల( REVENUE OFFICERS)కు కల్పతరువైందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని, రైతులు(farmers) రోడ్ల(ROADS) కోసం స్థలాలిస్తే సర్వీసు రోడ్లకు గోడలు(build walls on the service roads) నిర్మించి రైతులు పొలాల్లోకి వెళ్లకుండా  చేయడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్వయంగా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర పాలకులతో చర్చిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఢిల్లీ నుండి తిరిగి వచ్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు దారివ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని(large-scale movement) హెచ్చరించారు.   సనాతన థర్మం రాజ్యాంగానికి విరుద్ధమని( Sanatana Dharma is against the Constitution) నారాయ‌ణ అన్నారు. లడ్డూ వివాదాన్ని(laddoo controversy) తెరపైకి తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టడం(religious hatred ) సరికాదన్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ చేస్తోందన్నారు. జగన్ పై కోపంతో తిరుమల లడ్డూ వివాదంలో దేవుడిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంతో ఆర్ఎస్ఎస్(RSS)  లాభపడిందన్నారు(benefited). ఆ విషయంపై రాజకీయ నాయకులు మౌనంగా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరమన్నారు. పవన్ కల్యాణ్ చేగువేరా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి సావర్కర్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నాడన్నారు.(He said Pawan Kalyan is implementing Savarkar’s ideologies by keeping Cheguvera’s ideologies aside).
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) బేషరతుగా సమంత(Samantha)కు క్షమాపణ(apologize) చెప్పాలన్నారు. కాంగ్రెస్(Congress) కు కేటీఆర్(KTR), కేసీఆర్(kCR) తో విభేదాలుంటే వారిని రాజకీయంగా ఢీకొనాలే తప్ప అమాయకులను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు.  దేశ రాజకీయాల(politics of the country)ను ప్రస్తావిస్తూ బీజేపీ(BJP) ప్రయత్నిస్తున్న జమిలీ ఎన్నికలు(Jamili elections) దేశంలో ఫెడరల్ వ్వవ‌స్థ(federal system)కు విఘాతం కలిగిస్తుందన్నారు. దీనిని మెజారిటీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా బీజేపీ పాలకులు మాత్రం జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Exit mobile version