ఏపీ, తెలంగాణలో ముగిసిన నామినేషన్లు

ఏపీ అసెంబ్లీ 175స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో 17లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వాహణలో నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం మధ్యాహ్నం 3గంటలకు ముగిసిపోయింది

  • Publish Date - April 25, 2024 / 04:55 PM IST

ఏపీలో అసెంబ్లీకి 4,384నామినేషన్లు
లోక్‌సభ స్థానాలకు 763నామినేషన్లు
తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో 547నామినేషన్లు
అత్యధికంగా మల్కాజిగిరిలో 101నామినేషన్లు
కంటోన్మెంట్‌లో 38నామినేషన్లు
నేడు పరిశీలన..29న ఉపసంహరణ

విధాత, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ 175స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలో 17లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వాహణలో నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం మధ్యాహ్నం 3గంటలకు ముగిసిపోయింది. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. నేడు శుక్రవారం నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ..29న ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీలో 175అసెంబ్లీ స్థానాలకు 4,384నామినేషన్లు దాఖలయ్యాయి. 25లోక్‌సభ స్థానాలకు 763నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇకపోతే తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకుగాను 547నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి 101నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండలో 85 నామినేషన్లు, భువనగిరిలో 81, నిజమాబాద్‌లో 77, పెద్దపల్లిలో 74, కరీంనగర్‌లో 69, వరంగల్‌లో 62, సికింద్రాబాద్ 60, చేవెళ్లలో 59, ఖమ్మంలో 57, మెదక్‌లో 55, హైదరాబాద్‌లో 48, జహీరాబాద్‌లో 41, మహబూబ్ నగర్‌లో 42, ఆదిలాబాద్‌లో 39, మహబూబబాద్‌లో 32, నాగర్ కర్నూల్‌లో 23 నామినేషన్లు దాఖలైనట్లుగా సమాచారం. ఉప ఎన్నిక జరుగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 38నామినేషన్లు దాఖలయ్యాయి.

Latest News