ఓటు అమ్ముకున్న సొమ్ముతో మా షాపుకు రావద్దు

మీ ఓటును అమ్ముకున్న సొమ్ముకు మా షాపు నందు వస్తువులు అమ్మబడవని, రాజకీయ నేతలు పంచే అవినీతి సొమ్ము తీసుకొని ఓటు అమ్ముకున్న వ్యక్తులు మా షాపు నందు వస్తువులు కొనుటకు రావద్దంటూ గుడివాడలో ఓ దుకాణాదారుడు ఫెక్సీలతో నిర్వహించిన వినూత్న ప్రచారం వైరల్‌గా మారింది.

  • Publish Date - May 14, 2024 / 04:33 PM IST

గుడివాడలో ఓ దుకాణాదారుడు వినూత్న ప్రచారం

విధాత : మీ ఓటును అమ్ముకున్న సొమ్ముకు మా షాపు నందు వస్తువులు అమ్మబడవని, రాజకీయ నేతలు పంచే అవినీతి సొమ్ము తీసుకొని ఓటు అమ్ముకున్న వ్యక్తులు మా షాపు నందు వస్తువులు కొనుటకు రావద్దంటూ గుడివాడలో ఓ దుకాణాదారుడు ఫెక్సీలతో నిర్వహించిన వినూత్న ప్రచారం వైరల్‌గా మారింది. ఓటరు చైతన్యం కోసం గుడివాడ సీతారామ రేడియో స్టోర్స్ యాజమాని వై.వి.మురళీకృష్ణ తన దుకాణం ముందు పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఓటు అమ్ముకున్న సొమ్ముతో కాకుండా కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే మా షాపుకు రాగలరని, అటువంటి వారికి మా షాపు నందు వస్తువులను లాభం లేకుండా నచ్చిన రేటుకి ఇవ్వగలమని పేర్కోన్నాడు. నా ఒక్కడి వల్ల సమాజం మారిపోతుందా అనుకునే ఏ ఒక్కడి వల్ల సమాజానికి ప్రయోజనం లేదని రాసుకొచ్చాడు. వై.వి.మురళీకృష్ణ ఓటర్లలో చైతన్యం కోసం ఏర్పాటు చేసిన ఈ వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇదే సమయంలో విజయవాడ బీ సెంటర్ దుకాణాల్లో మాత్రం పోలింగ్ మరుసటి రోజు దుకాణాల్లో జనం రద్దీ పెరిగింది. రాజకీయ నాయకులు ఓటుకు ఇచ్చిన సొమ్ముతో జనం తమకు కావాల్సినవి కొనుక్కునేందుకు రావడంతోనే దుకాణాల్లో రద్ధీ పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు. గుడివాడ, విజయవాడలో చోటుచేసుకున్న ఈ విభిన్న పరిణామాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి

Latest News