Site icon vidhaatha

YSRCP family legal battle | సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

YSRCP family legal battle | జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCTL) లో వైఎస్ఆర్సీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును ఎన్‌సీటీఎల్ రిజర్వ్ చేసింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీపై తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిలపై వైఎస్ జగన్ ఎన్‌సీటీఎల్‌ను ఆశ్రయించారు. తమకు తెలియకుండానే తమ పేరుతో ఉన్న 51 శాతం వాటాను బదిలీ చేసుకున్నారని.. దీన్ని రద్దు చేయాలని జగన్ కోరారు.

తమ మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతీ పవర్‌లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవోయూ కుదిరిందని, అది షరతులతో కూడిన ఒప్పందమని జగన్ వాదన. ఆదాయినికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ, ఈడీ ఈ ఆస్తులను అటాచ్ చేశాయి. వీటిపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ షేర్ల బదిలీ విషయంలో జగన్ చేస్తున్న వాదనను షర్మిల తోసిపుచ్చారు. తల్లి, చెల్లిపై కోర్టును ఆశ్రయించడంపై అప్పట్లోనే ఆమె మండిపడ్డారు.

Exit mobile version