విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.