Site icon vidhaatha

టోక్యో పారాలింపిక్స్‌ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు

విధాత,విజయవాడ: టోక్యో పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అవని లేఖారాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా జావెలిన్ త్రోలో రెండవ స్వర్ణ పతకం సాధించినందుకు సుమిత్ ఆంటిల్, హైజంప్‌లో వెండి పతకం సాధించిన నిషద్ కుమార్, పురుషుల డిస్కస్ త్రోలో వెండి పతకం సాధించిన యోగేష్ కథునియా సేవలను క్రీడా లోకం మరువదన్నారు.

జావెలిన్ త్రో లో రజత పతకం సాధించిన దేవేంద్ర జారియా, కాంస్య పతకం పొందిన సుందర్ సింగ్ గుర్జార్ తో సహా పతక విజేతలందరూ గొప్ప సంకల్పం ప్రదర్శించారన్నారు.వారి కృషి ఫలించి మంచి ఫలితాలు వచ్చాయని గవర్నర్ చెప్పారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో సాధించిన విజయాలతో యావత్తు భారత దేశం గర్వపడు తుందని, భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version