Site icon vidhaatha

నందిగామ సబ్ డివజన్ పరిధిలోని ప్రజలకు DSP నాగేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి

కృష్ణా జిల్లా :నందిగామ,వీరులపాడు మండలం మధ్య దాములూరు కూడలి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వైర, కట్టలేరు..డిఎస్పి నాగేశ్వర రెడ్డి ఆదేశాలమేరకు దాములూరు కూడలి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన కంచికచర్ల రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ వీరులపాడు ఎస్ఐ సోమేశ్వర రావు..అక్కడ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసిన సీఐ నాగేంద్రకుమార్.ప్రవాహం ఎక్కువగా ఉందని వీరులపాడు మండల ప్రజలు ఇటువైపు రావద్దని రవాణా సౌకర్యం లేకపోవడంతో రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపి వేసిన సీఐ నాగేంద్ర కుమార్.

వరద ప్రవాహం తగ్గేవరకు ఎవరు ఇటువైపు రావద్దని ఆకు తెయన ప్రజలకు తెలియజేశారు.నందిగామ సబ్ డివజన్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..తుపాన్ కారణముగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలి.పోలీస్ వారు మరియు రెవెన్యూశాఖ వారు ఇచ్చే సలహాలు పాటించాలి. వ్యవసాయ పనులకు మరియు పశువులు మేపుటకు వెళ్ళె వారు వాగులు కాలువలుఏరుల వద్దకు వెళ్ళ కుండా సరియైన జాగ్రత్తలు పాటించాలి.ఏదైనా ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు ఆయా మండలాల ఎస్ఐలకు ఫోన్ చేసి సమాచారం అందించాలని నందిగామ DSP నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

Exit mobile version