Site icon vidhaatha

అమరరాజా మూసివేతపై మధ్యంతర ఉత్తర్వులు మరో ఆరు వారాలు పొడిగింపు

విధాత‌ : అమరరాజా పరిశ్రమలో పీసీబీ అధికారులు, ఐఐటీ మద్రాస్ నిపుణులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచాలని కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశించింది. పరిశ్రమలోని ఉద్యోగుల రక్తంలో లెడ్ శాతంపై పరీక్షలు చేసేందుకు పీసీబీ అధికారులకు సహకరించాలని అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ యాజమాన్యానికి హైకోర్టు సూచించింది. పీసీబీ మూసివేత ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఆరువారాలకు పొడిగిస్తూ వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్బీ , జస్టిస్ కె. సురేష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగుల గోపినాథ్ రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ . మోహన్ రెడ్డి, అమర్ రాజా బ్యాటరీస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

Exit mobile version