Site icon vidhaatha

Vizag | విశాఖ ఆర్కే బీచ్ వద్ద 1.54కోట్ల నగదు సీజ్‌

విధాత : విశాఖ పట్నం ఆర్కే బీచ్ వద్ద ఎన్నికల స్క్వాడ్ తనిఖీల్లో 1.54కోట్ల నగదు పట్టుబడింది. కారులో నగదుతో పాండురంగాపురం వైపు వెలుతుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. నిందితులు కారు వదిలి పరారయ్యారు. పట్టుబడిన నగదును సీజ్ చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో భారీ ఎత్తున నియోజకవర్గాల్లో డబ్బు,మద్యం పంపిణీ సాగడంతో ఎన్నికల స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేసింది.

ఇటు తెలంగాణ‌ ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఇన్నోవా కారు ఫల్టీ కొట్టగా అందులో కోటిన్నర నగదు పట్టుబడింది. నాయకన్నగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఇన్నోవా కారులో నగదు తరలిస్తున్న వ్యక్తులు కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇన్నోవా కారును వెంటాడి పది కిలోమీటర్ల చేజింగ్ చేశారు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇన్నోవా కారు అదుపు తప్పి మూడు ఫల్టీలు కొట్టింది. చివరకు అందులోని వారు, నగదుతో పాటు పోలీసులకు పట్టుబడ్డారు. కారులోని రెండు బ్యాగుల్లో సుమారు కోటిన్న నగటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో పంపిణీ కోసమే ఆ డబ్బును తరలిస్తున్నారని, అయితే ఆ నగదు ఎవరిది..ఎక్కడి నుంచి ఎవరికోసం తీసుకెలుతున్నారన్నదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Exit mobile version