విధాత:విజయవాడలోని ధర్నా చౌక్‌లో అత్యాచార నిరోధక పోరాట వేధిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా సంఘాలు, పౌరసంఘాలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళా నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.రాష్ట్రంలో మహిళలపై రోజుకో హత్య… పూటకో అత్యాచారం జరుగుతున్నాయన్నారు.
అమలులోలేని దిశా చట్టం గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారన్నారు.జగన్ సర్కార్ మహిళల మానప్రాణాలకు వెలకడుతోందని దుయ్యబట్టారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం కాదన్నారు.ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ముద్దులుపెట్టి… ప్రేమ వోలకబోసి ఇపుడు రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బాధితులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సుంకర పద్మశ్రీ తెలిపారు.