Janasena | జనసేన వినూత్న కార్యక్రమం.. నీట మునిగిన జగనన్న కాలనీల సందర్శన

Janasena | విధాత: గతంలో రోడ్ల మీద ఉన్న గుంతలు, గోతుల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ వినూత్నంగా ప్రభుత్వాన్ని విమర్శించిన జనసేన ఇప్పుడు కూడా మరో మారు ఇలాంటి వెరైటీ పోరాటానికి సిద్ధం అవుతోంది. గతంలో రోడ్ల మీద గోతులు, గొయ్యిల ఫోటోలు తీసి సీఎంను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వందలాది ఫోటోలు పోస్ట్ చేసారు. అప్పట్లో అది కొన్నాళ్ళు ట్రేండింగ్ లో నిలిచింది. అంతే కాకుండా కొన్ని చోట్ల జన సైనికులే చిన్న […]

  • Publish Date - July 29, 2023 / 03:37 AM IST

Janasena |

విధాత: గతంలో రోడ్ల మీద ఉన్న గుంతలు, గోతుల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ వినూత్నంగా ప్రభుత్వాన్ని విమర్శించిన జనసేన ఇప్పుడు కూడా మరో మారు ఇలాంటి వెరైటీ పోరాటానికి సిద్ధం అవుతోంది. గతంలో రోడ్ల మీద గోతులు, గొయ్యిల ఫోటోలు తీసి సీఎంను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వందలాది ఫోటోలు పోస్ట్ చేసారు. అప్పట్లో అది కొన్నాళ్ళు ట్రేండింగ్ లో నిలిచింది. అంతే కాకుండా కొన్ని చోట్ల జన సైనికులే చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి రోడ్లను బాగు చేశారు.

ఇప్పుడు కూడా అదే మాదిరిగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు జగనన్న కాలనీలను సందర్శించనున్నారు. ఈ వర్షాలకు పూర్తిగా వరద నీటితో నిండిపోయిన కాలనీల వద్దకు వెళ్లే జనసైనికులు అక్కడి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయనున్నారు. అంటే పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తున్నారని, ఆ ప్రాంతాలు అసలు జనావాసానికి పనికిరావన్న విషయాన్ని ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈమేరకు జన సైనికులు ఫోటోలు దిగి సీఎం ను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలని పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ క్యాడర్ కు పిలుపును ఇచ్చారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు, ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి.

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సైతం పూర్తిగా జలమయమై రవాణాకు విఘాతం కలుగు తోంది. ఇక చెరువులు సైతం పొంగిపొర్లుతూ గ్రామాల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జనసైనికులు ఆ జగనన్న కాలనీలను సందర్శించి అక్కడి వరద పరిస్థితిని ఫోటోలు తీసి ప్రజలకు వివరించే కార్యక్రమం చేపడుతున్నారు అన్నమాట

Latest News