Andhra Pradesh | అమరావతి : ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన గిరినాగు పాము జాతి సంరక్షణకు అభయారణ్యం ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తూర్పు కనుమలలో 2,400 హెక్టార్ల విస్తీర్ణంలో కింగ్ కోబ్రా(King Cobra) అభయారణ్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం రావాల్సి ఉంది. ఒకసారి నోటిఫై చేసిన తర్వాత, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కింగ్ కోబ్రా అభయారణ్యం కాబోతుంది. శంకరం రిజర్వ్ ల్యాండ్ (కాశిపురం బీట్, జీనబాదు రేంజ్, పాడేరు డివిజన్) లలో ఈ అభయారణ్యాన్ని ప్రతిపాదించారు. గిరినాగు విషపూరితమైనప్పటికి ప్రజలకు హాని కలిగించే విషపూరితమైన పాములను ఆహారంగా తీసుకుని వనంలో జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తుందని అటవీ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోనిఅటవీ శాఖ (విశాఖపట్నం సర్కిల్), తూర్పు కనుమల వన్యప్రాణుల సంఘం (ఈజీడబ్ల్యుఎస్),స్థానిక గిరిజన సంఘాల సహకారంతో పాడేరు అటవీ విభాగంలో కింగ్ కోబ్రా గూడు కట్టే ఆవాసాల పరిరక్షణ చేపట్టారు. ఇటీవల మొట్టమొదటిసారిగా కమ్యూనిటీ నేతృత్వంలో 30 కింగ్ కోబ్రా పిల్లల(ఓఫియోఫాగస్ హన్నా)ను తూర్పు కనుమల్లోకి విజయవంతంగా విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని గంగవరం గ్రామంలోని నల్లరాయి కొండకు ఆనుకుని ఉన్న అచ్చియ్యమ్మకు చెందిన జీడితోటలో కింగ్ కోబ్రా పెట్టిన గుడ్ల గూడు చుట్టు ప్రత్యేక వల కట్టి సంరంక్షించారు. అటవీ అధికారులు, సొసైటీ సభ్యులు ఒక నెలకు పైగా గుడ్లను పర్యవేక్షించారు. పిల్లలు బయటకు వచ్చాక వాటిని అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని వాలబు గ్రామానికి సమీపంలోని పాడేరు డివిజన్‌లోని అటవీ ప్రాంతాలలోకి విడుదల చేశారు. జాతుల-నిర్దిష్ట పరిరక్షణలో ఏపీ సాధించబోతున్న గొప్ప ముందడుగుగా దీనిని పరిగణిస్తున్నారు.
Read more : సీఎం, భట్టి, కోమటిరెడ్డిలకు రాఖీ కట్టిన సీతక్క
ర్యాన్సమ్వేర్ : సంస్థల సమాచార భద్రతకు సరికొత్త పెనుముప్పు