Site icon vidhaatha

జల శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ

విధాత,న్యూ ఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు భేటీ అయ్యారు. రెండు బోర్డుల ఛైర్మన్లు చంద్రశేఖర్‌ అయ్యర్, ఎం.పి.సింగ్‌ భేటీకి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి నిర్వహణకు వచ్చే నెల 14 నుంచి గెజిట్‌ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. గెజిట్‌లోని పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో గెజిట్‌పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ జలవివాదం పరిష్కారానికి రెండు బోర్డుల పరిధిలని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version