Site icon vidhaatha

CM Chandrababu | ఏపీ బ్రాండ్‌ పునరుద్దరణకు లక్ష్యంగా ముందడుగు: సీఎం చంద్రబాబు

నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం
సహజ వనరుల దోపిడికి అడ్డుకట్ట వేస్తాం
అక్రమార్కులను వదలిదే లేదు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు

విధాత : గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ (Andhra Pradesh Brand)ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు (CM Chandrababu naidu) స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామని, 100 రోజుల ప్రణాళిక (100 Days Planning) లక్ష్యంగా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తూ ముందుకెలుతున్నామన్నారు.

గత ప్రభుత్వం హాయంలో ప్రభుత్వ శాఖలన్ని నిర్వీర్యమైపోయాయని, వాటిని తిరిగి క్రియాశీలకం చేసేందుకు చర్యలు చేపట్టామని, ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నామని, నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులన్ని నిండాయని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తామని, రైతు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. వంశధార (Vamsadhara), నాగావళి (Nagavalli), గోదావరి (Godawari), కృష్ణా (Krishna), పెన్నా (Penna) నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానమని, గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. యువతలో నైపుణ్యభివృద్ధి చేసి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తామన్నారు.

అక్రమార్కులను వదలబోము

గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ (CID) విచారణ జరిపిస్తామని, సహజ వనరుల దోపిడికి అరికడుతామన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని, గత ప్రభుత్వ హయంలోని అన్ని అక్రమాలపై విచరణ జరిపించి అక్రమార్కులను శిక్షించి తీరుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్ సిక్స్ తో 6 హామీలు ఇచ్చామని, రాష్ట్ర పరిస్థితిపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు (White Papers) విడుదల చేశామని గుర్తు చేశారు.

1857 కంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారని, ఇది చైతన్యం కలిగిన ప్రాంతమని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో ఆనాడు మేం పాలన ప్రారంభించామని, అనుభవం, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించి 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో (Ease of Doing Business) ప్రథమంగా నిలిచామని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు, ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించుకోగా, గత ప్రభుత్వం దానిని ధ్వంసం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.

Exit mobile version