అమరావతి : కృష్ణా జిల్లా పెడనలో ముగ్గురు బాలికలు అదృశ్యమవ్వడం కలకలం రేపింది. పెడనలోని ఉర్దూ మదర్సా నుంచి బాలికల అదృశ్యం అయ్యారు. ముగ్గురు బాలికలు కాకినాడ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోని అల్లూరి జిల్లా పెదబయలు ఆశ్రమం పాఠశాల నుంచిఅదృశ్యమైన ఇద్దరు బాలికలు రెండు రోజుల క్రితం సురక్షితంగా దొరికారు. కించూరు గ్రామ శివారు కొండ గుహపై స్థానికులు విద్యార్థినిలను గుర్తించారు. రాష్ట్రంలో మరోసారి బాలికల అదృశ్యం ఘటన సవాల్ గా మారింది.
