Leopard Attack Man Riding Bike | విధాత: తిరుమలలో మళ్లి చిరుత పులుల సంచారం కలకలం రేపింది. తాజాగా అలిపిరి, ఎస్వీ జూ పరిసరాల్లో ఇటీవల కనిపించి మాయమైన జూపార్క్ రోడ్డులో మళ్లీ కనిపించింది. రాత్రి పూట ఈ మార్గంలో బైక్ పూ వెలుతున్న వారిపై దాడికి ప్రయత్నించిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో భక్తుల భద్రతకు టీటీడీ, అటవీశాఖ అధికారులు మరింత బందోబస్తు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాల్లో నిఘా పెంచారు.
రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించరాదని భక్తులకు సూచించారు. గతంలో మెట్ల మార్గంలో ఓ చిన్నారిని హతమార్చిన చిరుత ఘటన అనంతరం అటవీ శాఖ వరుసగా ఐదు చిరుతలను బంధించి ఇతర ప్రాంత అడవులలో వదిలేసింది. మళ్లీ తాజాగా తిరుమలలో చిరుతల సంచారం కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
Leopard scare in Tirupati
A #biker had a narrow escape from a #leopard attack near #Zoo Park Road.
The big cat was later spotted near #Aravind Eye Hospital at midnight too. pic.twitter.com/qZGjpW97Z8
— NewsMeter (@NewsMeter_In) July 26, 2025