Fire Breaks Out At Tobacco Factory In AP | భారీ అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Massive Fire Breaks Out At Tobacco Factory In Andhra Pradesh

అమరావతి : ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల రూ.500 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నిర్వహిస్తుంది. అగ్ని ప్రమాదంతో పెద్దఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించారు.