Site icon vidhaatha

Nagarkurnool : కన్నబిడ్డలకు కాలయముడైన తండ్రి..ముగ్గురు పిల్లలను చంపేసి ఆత్మహత్య

Nagarkurnool murder

విధాత : కంటికి రెప్పాలా కన్నబిడ్డలను సాకాల్సిన తండ్రి వారి పాలిట కాలయముడయ్యాడు. తన ముగ్గురు పిల్లలపై పెట్రల్ పోసి నిప్పంటించి హతమార్చిన కిరాతక తండ్రి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నుల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులకు కుమార్తెలు మోక్షిత (8), వర్షిణి (6), కుమారుడు శివధర్మ(4) ఉన్నారు. భార్యతో కలహాల నేపథ్యంలో వెంకటేశ్వర్లు గత నెల 30న కుమార్తెలు, కుమారుడిని తీసుకుని శ్రీశైలం వెళ్లాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి పిల్లలను తీసుకుని తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌కు వెళ్లాడు.

31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో చిన్నకుమార్తె వర్షిణి, కుమారుడు శివధర్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు మృతదేహం వెల్దండ మండలం పెద్దాపుర్‌ శివారు బూరకుంట వద్ద లభ్యమైంది. తన సోదరుడు, అతడి పిల్లలు కనింపించడం లేదని వెంకటేశ్వర్లు సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో ఈ విషాదం వెలుగుచూసింది. ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలు పరిశీలించి..దర్యాప్తు బృందాలు శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో చేపట్టిన గాలింపులో కిరాతక తండ్రి దారుణం బయటపడింది. ఎక్కడో ఓ చోట ప్రాణాలతో ఉంటారనుకున్న అంచనాలకు భిన్నంగా వెంకటేశ్వర్లు, పిల్లులు చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Exit mobile version