అమరావతి : ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. 2019లో కొత్త ప్రాజెక్టులను ఆపివేసిన ఒక కంపెనీ రేపు ఏపీకి తుఫానులా తిరిగి వస్తోంది అని పోస్టులో పేర్కొన్నారు. రేపు ఉ. 9 గంటలకు BIG UNVEIL అంటూ ఎక్స్ లో లోకేష్ పోస్ట్ చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సీ.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో లోకేష్ పోస్టు ఆసక్తి రేపింది.
అంతకు ముందు సీఐఐ సదరన్ రీజియన్ – విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు చేపట్టాలన్నారు. డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలన్నారు. స్కిల్ అంతరాలను భర్తీచేసేందుకే ఏపీలో నైపుణ్య గణన కార్యక్రమాలు చేపడుతామన్నారు. $ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అని తెలిపారు. గత 17నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, సీఐఐ పెట్టుబడుల సదస్సులో మరో $120 డాలర్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టకున్నామని వెల్లడించారు. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది, $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మానవవనరులు, మేధోసంపద లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు. ఈ మహోన్నత లక్ష్యఛేదనకు ఉన్నతవిద్యా రంగం వ్యూహాత్మక మూలస్థంభం అని లోకేష్ పేర్కొన్నారు.
