Cyclone Montha : మొంథా తుపాన్ తో ఒరిస్సాలో చిక్కుకున్న ఏపీ బోట్లు!

మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీకి చెందిన 50 ఫిషింగ్ బోట్లు ఒడిశా గోపాల్‌పూర్ ఓడరేవులో చిక్కుకున్నాయి. తుపాన్ ధాటికి సముద్రతీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Cyclone Montha

అమరావతి : సముద్రంలోకి వెళ్లిన ఫిషింగ్ బోట్లు మొంథా తుపాన్ ధాటికి తిరిగి వెనక్కి రాలేకో ఓరిస్సాలో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఫిషింగ్ బోట్లు మొంథా తుపాన్ కారణంగా తిరిగి రాలేక గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ ఓడరేవు నౌకాశ్రయంలో ఉండిపోయాయి. ఇక్కడ 50 ఫిషింగ్ బోట్లను లంగరు వేశారు. తుపాన్ నేపథ్యంలో ఒడిశా ఫిషింగ్ బోట్లను గోపాల్‌పూర్ బెర్తులో ఉంచారు.

మొంథా తుపాన్ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాకుండా..బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతం రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడులపై కూడా ప్రభావం చూపనుండటంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆయా రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనుండటంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు, గ్రామాలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలలో విపరీతమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.