విధాత: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజర్ సలహాతో లోకేష్ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే పదజాలం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. అడవుల్లో నివసించే, ఆది మానవుల ప్రవర్తన.. అసభ్యకరమైన భాష మాట్లాడితే ప్రజలు హర్షించరని తెలిపారు.
‘‘లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా… ఈ సమాజంలో పుట్టాడా.. అమెరికాలో ఎంబీఎ చదివాడా.. ఇవన్నీ బోగస్ డిగ్రీలా.. నీకేమైనా మతి భ్రమించింది’’ అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2024కి తెలుగుదేశం పార్టీ ఉండదని ఎంపీ అన్నారు. పెద్ద నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని… చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అంతర్ధానమైపోతుందన్నారు. అనంతపురం, కుప్పంలో టీడీపీ డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపిం చారు. ఉప ఎన్నికల విషయంలో టీడీపీ ధర్మ విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టే వైసీపీ అన్నిచోట్ల పోటీ చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన సమక్షంలో పలు వార్డుల్లో చెందిన టీడీపీ, బీజేపీ మరికొంతమంది నేతలు వైసీపీలో చేరారు.