ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఐడీ పీటీ ఏసీబీ అనుమతిస్తూ బాబును సోమవారం కోర్టు ముందు హాజరుపరుచాలని ఆదేశించింది.

  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
  • అంగళ్లు కేసులో బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు
  • స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ విచారణ 17కి వాయిదా
  • ఏసీబీ కోర్టులో వాగ్వివాదం…కేసు విచారణ వాయిదా

విధాత : ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఐడీ పీటీ వారెంట్‌పై విచారణ పూర్తి చేసిన ఏసీబీ జడ్జీ పీటీ వారెంట్‌ను అనుమతిస్తూ బాబును సోమవారం కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుపరుచాలని ఆదేశించింది.ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల లోపు హాజరుపరుచాలని ఆదేశించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులోబాబుకు ఈనెల 19వ వరకు జ్యూడిషియల్‌ రిమాండ్ ఉంది. అటు సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహారిస్తామని, అవసరమైతే ఇంటర్వేన్ కావచ్చంటూ బాబు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు తెలిపింది. పీటీ వారెంట్ కేసులో సీఐడీ తరుపున వివేకానంద వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ అనంతరం చంద్రబాబు తరుపు లాయర్లు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ విచారణను వాయిదా వేయాలని సీఐడీ న్యాయవాది కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించకపోవడంతో ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. వాదనల సందర్భంగా రెండు వైపుల వాదనలు వినిపించిన న్యాయవాదుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోర్టు హాల్ అరుపులతో హోరెత్తడంతో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్సులో ఉన్న వారు మినహా మిగతా న్యాయవాదులంతా బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇలాగైతే విచారణ నిలిపివేస్తానని అసహనం వ్యక్తం చేశారు కోర్టు హాలులో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని ఆదేశించారు. వివాదాలు ఉంటే ఈ కేసు విచారణ చేయలేనంటూ న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోయారు. కేసు విచారణ వాయిదా వేశారు.

అంగళ్లు కేసులో తీర్పు రిజర్వ్‌

అంగళ్లు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారం వాయిదాకు వేసింది. తీర్పును ఇదే రోజు వెల్లడిస్తామని తెలిపింది.

లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్‌

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. పిటిషన్‌లో సీఐడీ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ స్కిల్ కేసులో లోకేశ్‌ను ముద్దాయిగా చూపలేదని, అలాంటప్పుడు అరెస్టు ఉండదని, కేసులో లోకేశ్ పేరు చేర్చితే 41ఏ మేరకు ముందుకెలుతామన్నారు. ఇరువైపుల వాదనలు ఉన్న న్యాయస్థానం లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

స్కిల్ కేసులో బెయిల్ విచారణ 17కు వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ప్రజా జీవితంలో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తుకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని బెయిల్ మంజూరు చేయాలని బాబు కోర్టును అభ్యర్ధించారు.

Latest News