Tirumala | శ్రీవారి వీఐపీ బ్రేక్‌ టికెట్ల జారీ మళ్లీ మొదలు.. సిఫారసు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ

Tirumala | ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ (Election code) నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో గత నెల రోజులుగా నిలిచిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మళ్లీ మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు.. వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం భక్తులు తీసుకొచ్చే సిఫారసు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు.

  • Publish Date - May 21, 2024 / 08:41 AM IST

Tirumala : ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ (Election code) నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో గత నెల రోజులుగా నిలిచిపోయిన వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మళ్లీ మొదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు.. వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం భక్తులు తీసుకొచ్చే సిఫారసు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక ఎప్పటిలాగే వీఐపీల సిఫారుసుపై బ్రేక్‌ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. దాంతో గతంలో మాదిరినే టీటీడీ బోర్డు సభ్యులకు రోజుకు పది వీఐపీ బ్రేక్ టికెట్లను, పది రూ.300 ఎస్‌ఈడీ టికెట్లను సిఫారసు లేఖలపై జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్‌ టికెట్లను ఇస్తున్నారు.

కాగా, శ్రీవారి సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటల సమయం పట్టింది. ఇదిలావుంటే సోమవారం అలిపిరి నడకదారికి సమీపంలో ఆఖరి మెట్ల దగ్గర సోమవారం రెండు చిరుతలు సంచరించాయి. భక్తులు వాటిని చూసి కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయాయి. చిరుతల అలికిడితో అధికారులు ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

Latest News