విధాత : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహనసేవ నిర్వహించారు. ఐదు తలల శేష వాహనంపై మలయప్పస్వామి తిరుమాఢ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా భక్తులకు శ్రీనివాసుడు అభయ ప్రదానం చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం స్నపనం నిర్వహించారు. రాత్రి 7గంటలకు శ్రీవారికి హంస వాహన సేవ నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.