Site icon vidhaatha

ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?: చంద్రబాబు

విధాత,అమరావతి:75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు. ‘‘మన ప్రజలు నిర్బంధాలు, అణచిత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నాయకులు ఎన్నో మహోన్నత త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, వారి భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకేళ్లు పడుతుంటే ఆ మహనీయుల త్యాగాలకు అర్థం ఏముంది?. మన సంపదను మన పాలకులే దోచుకుంటుంటే.. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలను మన పాలకులే అణచివేస్తుంటే ఏం చేయాలి? జాతీయోధ్యమ స్ఫూర్తితో పోరాడి మన సమాజాన్ని రక్షించుకోవాలి. పాలకుల దుర్మార్గాలను ఒక్కటిగా ఎదిరించాలి. ఇది ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం’’ అని అన్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికి చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.

Exit mobile version