Site icon vidhaatha

చంద్రబాబు రాకతో సీఎం నినాదాల హోరు నేడు సంబరాలకు సిద్ధం కావాలన్న.. బాబు

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు సోమవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు సీఎం సీఎం అన్న నినాదాలతో హోరెత్తించాయి. పోలింగ్ ముగిశాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల విజయంపై ధీమాతో ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

చంద్రబాబును చూసిన కార్యకర్తలు ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అది చూసిన చంద్రబాబు సంబరాలు కౌంటింగ్ రోజున చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ కేడర్‌ను ఉద్ధేశించి చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ విజయం కోసం పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష చేసి అభ్యర్థులకు, పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్లో తాను సైకిల్ తొక్కుతున్న ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ గుర్తు కూడా సైకిల్ కావడంతో.. సైక్లింగ్ వ్యక్తులకు, సమాజానికి మంచిదని ట్విట్‌లో ఆయన కామెంట్ పెట్టారు.

Exit mobile version