Beauty tips | స్త్రీలు బలమైన వెంట్రుకల కోసం ఏం చేయాలి..?

Beauty tips : మహిళలు రకరకాల హెయిర్‌స్టైల్స్‌ మెయింటెయిన్‌ చేయాలంటే జట్టు పొడువుగా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే హెయిర్‌ స్టైల్స్‌ మెయింటెనెన్స్‌లో భాగంగా హీట్‌ థెరపీ, కెమికల్స్‌ వాడటం లాంటివి ఉంటాయి. మరి ఇలాంటివి తట్టుకోవడానికి బలమైన, ఆరోగ్యవంతమైన జుట్టు అవసరం. మరి మన జుట్టు బలంగా తయారవ్వాలన్నా, ఆరోగ్యంగా నిగనిగలాడాలన్నా కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Publish Date - June 14, 2024 / 08:07 PM IST

Beauty tips : మహిళలు రకరకాల హెయిర్‌స్టైల్స్‌ మెయింటెయిన్‌ చేయాలంటే జట్టు పొడువుగా, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే హెయిర్‌ స్టైల్స్‌ మెయింటెనెన్స్‌లో భాగంగా హీట్‌ థెరపీ, కెమికల్స్‌ వాడటం లాంటివి ఉంటాయి. మరి ఇలాంటివి తట్టుకోవడానికి బలమైన, ఆరోగ్యవంతమైన జుట్టు అవసరం. మరి మన జుట్టు బలంగా తయారవ్వాలన్నా, ఆరోగ్యంగా నిగనిగలాడాలన్నా కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిట్కాలు..

  • జట్టు బలంగా ఉండాలంటే తలస్నానం చేసేటప్పుడుగానీ, నూనె పట్టించేటప్పుడుగానీ మాడును గట్టిగా రుద్దకూడదు. అదేవిధంగా ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. అలా చేయడంవల్ల వెంట్రుకల కుదుళ్ల నుంచి సహజంగా విడుదలయ్యే ఉపయోగకరమైన తైలాలు పూర్తిగా తొలగిపోతాయి. దానివల్ల జుట్టు పొడిబారుతుంది. అంతేగాక వెంట్రుకల మొదళ్లు దెబ్బతిని జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మహిళలు వారంలో రెండుసార్లకు మించి తల స్నానం చేయకూడదు.
  • అదేవిధంగా హెయిర్‌ డ్రైయర్‌, స్టైలింగ్‌ టూల్స్‌ లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగించకూడదు. వాటిని పదేపదే వాడడంవల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది.
  • పోషక విలువలతో కూడిన ఆహారం కూడా జుట్టు సంరక్షణలో ముఖ్యపాత్ర వహిస్తుంది. కురుల ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్‌, మినరల్స్‌, ప్రొటీన్స్‌, ఒమేగా ఫాటీ యాసిడ్స్‌తో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • అంతేగాక గుడ్డు, తేనె మిశ్రమాన్ని వారానికి ఒకసారి మాస్క్‌లా వేసుకోవడంవల్ల జుట్టు పొడిబారకుండా, చిట్లిపోకుండా జాగ్రత్తపడవచ్చు.
  • అదేవిధంగా నిమ్మరసం, ఆపిల్‌ సీడర్‌ వెనిగర్‌, నీళ్ల మిశ్రమాన్ని తల స్నానానికి ఓ గంట ముందు జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడంవల్ల జుట్టుకు నల్లని మెరుపు వస్తుంది.
  • ఇవేగాక పెరుగులో కొద్దిగా మిరియాలపొడి కలిపి తలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడంవల్ల జుట్టులో చుండ్రు సమస్య తొలగిపోతుంది.

Latest News