Site icon vidhaatha

పుష్ప‌తో ఐకాన్ స్టార్‌గా మారిన బ‌న్నీ.. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో రామ్ చ‌ర‌ణ్‌కి కొత్త బిరుదు

ఇప్పుడు మ‌న తెలుగు హీరోల స్థాయి క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. ఒక‌ప్పుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు దేశం మొత్తం మ‌న‌వైపే చూస్తుంది. తెలుగులో రూపొందే సినిమాల‌పై నేష‌న‌ల్ మీడియా కూడా ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. ఇటీవ‌ల మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌రణ్- బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఆర్సీ16 గ్రాండ్‌గా లాంచ్ అయింది. మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్ అతిథులుగా హాజ‌రు కాగా, చిత్ర బృందం రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్, బుచ్చి బాబు, ఏఆర్ రెహ‌మాన్ ప‌లువురు నిర్మాత‌లు సంద‌డి చేశారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ హాట్ టాపిక్‌గా మారింది.

బుచ్చిబాబు తెర‌కెక్కించ‌నున్న చిత్రం రా అండ్ ర‌స్టిక్ నేచ‌ర్‌తో రంగ‌స్థలం క‌న్నా ప‌ది రెట్లు క‌న్నా గ్రాండ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా క‌న్నా కూడా బుచ్చిబాబు సినిమాపైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. మంచి కాస్టింగ్ ఈ మూవీకి కుద‌ర‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌పై ఓ లుక్కేస్తున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మం త‌ర్వాత అభిమానులు రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో ఓ కీల‌క విష‌యాన్ని ప్ర‌స్తావ‌నకి తీసుకొచ్చారు. చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ మెగా ప‌వ‌ర్ స్టార్‌గా పిల‌వ‌బ‌డుతున్నాడు. సినిమా టైటిల్ కార్డ్స్ లో, పోస్టర్స్ లో చెర్రీ పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది సడెన్ గా మారిపోయింది.

బుచ్చిబాబు చిత్రం పూజా కార్య‌క్ర‌మంకి సంబంధించి మైత్రి మూవీస్ సంస్థ అఫీషియల్ గా పోస్టర్స్, పూజా కార్యక్రమం వీడియోలలో రాంచరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో చ‌ర‌ణ్ కి గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ రావ‌డంతో బుచ్చిబాబు త‌న సినిమా టైటిల్ కార్డ్స్‌లో గ్లోబ‌ల్ స్టార్ అని వేసిన‌ట్టుగా తెలుస్తుంది ఇక ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ రాంచరణ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ ట్యాగ్ పోయి ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌గా పిల‌వ‌బ‌డ‌తాడా అనేది చూడాలి. మ‌రి కొత్త బిరుదు చరణ్ కి ఎంతలా కలసి వస్తుందో అనేది కూడా వేచి చూడాలి. కాగా, ఎన్టీఆర్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి మాన్ ఆఫ్ మాసెస్ కి మారిన విష‌యం తెలిసిందే.

Exit mobile version