Anti-India Slogans In Dhaka | ఢాకాలో భారత వ్యతిరేక నినాదాలు..కశ్మీర్ కోసం పోరాడాలని ఉగ్రవాది పిలుపు

ఢాకాలో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ కశ్మీర్ కోసం బంగ్లాదేశ్–పాక్ కలిసి పోరాడాలని పిలుపు ఇవ్వడం కలకలం రేపింది.

Anti-India Slogans In Dhaka

దాయాది దేశం పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు భారత్‌ను అస్తిరపరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా టెర్రరిస్టులు తమ వక్రబుద్ధిని చూపిస్తూనే ఉన్నారు. తాజాగా భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో పాక్ ఉగ్రవాదులు భారత వ్యతిరేక నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కాశ్మీర్ కోసం బంగ్లాదేశ్, పాక్ కలిసి పోరాడాలని పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది ఢాకాలో పిలుపునిచ్చాడు. దీంతో భారత తూర్పు సరిహద్దు భద్రతకు కొత్త సవాల్ గా మారిందని చెప్పొచ్చు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన నిరసనలో జైషే ఉగ్రసంస్థకు చెందిన జహీర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ‘కశ్మీర్ కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ కలిసికట్టుగా పోరాడాలి’ అని బహిరంగంగా పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్‌లోని కొన్ని రాడికల్ శక్తులు, పాకిస్థానీ ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు భారత దేశానికి అత్యంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకొవచ్చు.

ఎందుకంటే.. భారత్, బంగ్లాదేశ్‌తో దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఇది మన దేశానికి ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యంత పొడవైనదిగా ఉంది. ఇలాంటి సున్నితమైన సరిహద్దుకు సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం లేదా రాడికల్ భావజాలం వ్యాప్తి చెందడం భారత్ ఏమాత్రం మంచిది కాదు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను భారత భద్రతా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Latest News